బండి సంజయ్‌పై ఎమ్మెల్యే మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు.. తొందర్లోనే బండి రాసలీలలు..

Mynampally Hanumantha Rao: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 15 Aug 2021 6:28 PM IST
TRS MLA Mynampally Hanumantha Rao Controversial Comments On Bandi Sanjay
X

బండి సంజయ్‌పై ఎమ్మెల్యే మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు.. తొందర్లోనే బండి రాసలీలలు..

Mynampally Hanumantha Rao: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను రెచ్చగొట్టేలా సంజయ్ వ్యక్తిగత ఆరోపణలు చేశారన్నారు. తన గురించి ఏం తెలుసని యూజ్‌లెస్ ఫెలో అన్నారో చెప్పాలని డిమాండ్ చేశారాయన. ఇంకోసారి మల్కాజ్‌గిరిలో అడుగుపెడితే బండి గుండు పగులుద్ది. నేటి నుంచి సంజయ్ భరతం పడతా. తొందర్లోనే బండి సంజయ్ రాసలీలలు మీడియా ముందు పెడతా అని మైనంపల్లి అన్నారు. మల్కాజ్‌గిరి కార్పొరేటర్ శ్రవణ్‌పై టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎవరూ దాడి చేయలేదన్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా సంజయ్ తప్పుడు ఆరోపణలు చేశాడు. బండి సంజయ్ స్థాయి కార్పొరేటర్‌కి ఎక్కువ ఎంపీకి తక్కువ అని మైనంపల్లి హనుమంతరావు ఎద్దేవాచేశారు.

ఎమ్మెల్యే మైనంపల్లి, స్థానిక బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌ల మధ్య వాగ్వివాదం జరిగింది. జాతీయ జెండాలో భారతమాత ఫోటో అంశంపై వివాదం చెలరేగింది. దీంతో శ్రవణ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. గాయపడిన కార్పొరేటర్ శ్రవణ్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆస్పత్రికి వెళ్లి శ్రవణ్‌ను పరామర్శించారు. మైనంపల్లి గుండాయిజం చేస్తున్నారని, రేపటి నుంచి ఎమ్మెల్యే కబ్జాలన్నీ బయటకు తిస్తామని హెచ్చరించారు. పోలీసు అధికారుల ముందు దాడి చేస్తుంటే పోలీసులు ఎవరికి కొమ్ము కాస్తున్నారని ప్రశ్నించారు. మహిళలపై దాడి చేస్తే పోలీసులు ఏం చేస్తున్నారని సంజయ్ నిలదీశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story