నేలపై పడుకుని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నిరసన

Arun Chilukuri
Published on: 12 Dec 2020 5:11 PM IST
నేలపై పడుకుని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నిరసన
X

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నేలపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. యశ్వంత్‌పూర్‌ వాగులోకి వెళ్లే మురికి కాల్వపై స్టే ఎత్తివేయాలని నిరసన తెలిపారు. జనగామ మున్సిపాలిటి నుంచి యశ్వంతపూర్ వాగులోకి మళ్లించే మురికి కాల్వ విషయంలో ఆ గ్రామ మాజీ సర్పంచ్‌ సుశీల తన తీరు మార్చుకోవాలని కోరారు. యశ్వంతపూర్‌ వాగులోకి జనగామ మున్సిపాలిటీ మురికి కాల్వ వద్దని చెప్పి గతంలో తెచుకున్న కోర్టు స్టేను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాజీ సర్పంచ్‌ తనకు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నేలపై పడుకొని నిరసన తెలిపారు. స్టేను వెనక్కి తీసుకుంటేనే అభివృద్ది పనులకి శంకుస్థాపన చేస్తానని భీష్మించుకు కూర్చున్నారు. దాంతో మాజీ సర్పంచ్ సుశీల తన స్టే వెనక్కి తీసుకొని ఎమ్మెల్యేకి సహకరిస్తానని చేప్పడంతో ఆయన లేచి అభివృద్ది పనులకి శంకుస్థాపన చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story