Telangana: టీఆర్ఎస్‌లో గ్రూపు తగాదాలు.. అధికారి కాలర్ పట్టుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

TRS MLA Krishna Mohan Reddy: గద్వాలలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల మధ్య గ్రూపు తగాదాలు మరోసారి భగ్గుమన్నాయి.

Arun Chilukuri
Published on: 22 Nov 2022 6:14 PM IST
TRS MLA Krishnamohan Reddy Miss Behavior With Official
X

Telangana: టీఆర్ఎస్‌లో గ్రూపు తగాదాలు.. అధికారి కాలర్ పట్టుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

TRS MLA Krishna Mohan Reddy: గద్వాలలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల మధ్య గ్రూపు తగాదాలు మరోసారి భగ్గుమన్నాయి. మొన్నటి వరకు అంతర్గతంగా ఉన్న... విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో MLA కృష్ణమోహన్‎రెడ్డి వర్సెస్ జడ్పీ ఛైర్ పర్సన్ సరితగా సాగింది. తాను రాకముందే జడ్పీ ఛైర్ పర్సన్ పాఠశాలను ప్రారంభించడంపై MLA కృష్ణమోహన్‎రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తానురాక ముందే ఎలా ప్రారంభిస్తారంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. జిల్లా స్థాయి అధికారి చొక్కా పట్టుకొని దాడి చేయబోయారు. అక్కడే ఉన్న సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో గొడవ సద్దుమణిగింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story