logo
తెలంగాణ

MLA Jeevan Reddy: కేసీఆర్‌ను టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండమే.. పార్టీ ఆదేశిస్తే యూపీలో ప్రచారం చేస్తాం..

TRS MLA Jeevan Reddy Slams BJP Leaders
X

MLA Jeevan Reddy: కేసీఆర్‌ను టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండమే.. పార్టీ ఆదేశిస్తే యూపీలో ప్రచారం చేస్తాం..

Highlights

MLA Jeevan Reddy: బీజేపీ నేతల వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పియూసీ ఛైర్మన్ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

MLA Jeevan Reddy: బీజేపీ నేతల వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పియూసీ ఛైర్మన్ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ నేతలు సంక్రాంతికి వచ్చే గంగిరెద్దుల్లా తెలంగాణకు వస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ను అనే దమ్ము, ధైర్యం, అర్హత బీజేపీ నేతలకు లేవన్నారు. కేసీఆర్ ను టచ్ చేసి చూస్తే ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు.

బీజేపీ సీఎంలు సర్కస్ కంపెనీలో జోకర్లు, ఆర్టిస్టులని మండి పడ్డారు. ఈసారి జాతీయ రాజకీయాలు కచ్చితంగా మారతాయని, కేసీఆర్ ఆదేశిస్తే యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామనీ అన్నారు జీవన్ రెడ్డి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైనా జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. బీజేపీకి రేవంత్ బీ టీమ్ అని ఫాదర్ ఆఫ్ సుపారీ అనీ విమర్శించారు.

Web TitleTRS MLA Jeevan Reddy Slams BJP Leaders
Next Story