Bhupalpally: జడ్పీలపై కక్ష సాధింపు కొనసాగుతోందా?

TRS MLA Gandra Venkataramana Reddy Vs ZP Chairperson Sri Harshini
x

Bhupalpally: జడ్పీలపై కక్ష సాధింపు కొనసాగుతోందా?

Highlights

Bhupalpally: భూపాలపల్లి జడ్పీ ఛైర్‌పర్సన్‌ అణిచివేతకు గురవుతున్నారా?

Bhupalpally: భూపాలపల్లి జడ్పీ ఛైర్‌పర్సన్‌ అణిచివేతకు గురవుతున్నారా? నియోజకవర్గంలో ఆమెకు కనీసం ఎంట్రీ కూడా ఉండడం లేదా? అధికారులు కూడా ఆమె విషయంలో వివక్ష చూపిస్తున్నారా? జడ్పీ ఛైర్మన్‌గా తన అధికారాలను వినియోగించుకోవడానికి కూడా ఆమెకు అధికారం లేదా? సొంత పార్టీలోనే వినిపిస్తున్న గుసగుసలు ఏంటి? భూపాలపల్లి జిల్లా గులాబీ దళంలో కోల్డ్ వార్‌కు కారణాలేంటి?

తెలంగాణ రాష్ట్రంలో జడ్పీ చైర్‌పర్సన్‌లకు పవర్స్ తో పాటు ప్రెస్టేజ్ కూడా కరువైందన్న ప్రచారం జరుగుతోంది. కేవలం పేరుకే తప్ప ఎక్కడా వారికి ప్రాధాన్యం దక్కడం లేదట. ప్రత్యేకించి వరంగల్‌ రూరల్ జిల్లాల్లో అయితే జెడ్పీ చైర్‌పర్సన్‌ల పరిస్థితి మరీ దారుణంగా ఉందట. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పిందే వేదం తప్ప వారు సొంతంగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోకూడదట. ఒకవేళ ఏదైనా మంచి చేయాలని చూస్తే తమకు తెలియకుండా చేశారంటూ జడ్పీలపై కక్ష సాధింపు కొనసాగుతోందన్న చర్చ జరుగుతోంది. ఇందుకు నిదర్శనం భూపాలపల్లి నియోజకవర్గమేనట.

భూపాలపల్లిలో జెడ్పీ చైర్‌‌పర్సన్‌గా జక్కుల శ్రీహర్షిణి కీలక పదవిలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇతరత్రా కార్యక్రమాలకు ఆమెను ఆహ్వానించడం లేదని గులాబీ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉన్నత విద్యనభ్యసించి ప్రజా సేవ చేసేందుకు అవకాశం వచ్చిన ఓ మహిళా ప్రజాప్రతినిధిని అవమానిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. జెడ్పీ చైర్‌పర్సన్‌గా పదవిలో ఉన్నా జిల్లాలో ఎలాంటి రాజకీయ ఉనికి లేకదంటూ హర్షిణి తన సన్నిహితుల వద్ద అంటున్నారట. మంథని నియోజకవర్గంలోని కాటారం, మహాముత్తారం, మల్హర్, మహాదేవపూర్ మండలాల్లో జరిగే కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతున్న హర్షిణికి రాజకీయ బెదిరింపులు ఎక్కువయ్యాయన్న ప్రచారం జరుగుతోంది.

తన అనుమతి లేకుండా నియోజకవర్గంలో పర్యటించొద్దు ఏదైనా ఉంటే మీ పరిధిలో మీరు చేసుకోండి అంటూ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించినట్లుగా నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. కాన్‌స్టెన్సీలో అడుగుపెడితే పదవి ఊడుతుందన్న బెదిరిస్తుండటంతో ఆమె జిల్లా కేంద్రానికి రావడానికి ఇష్టపడడం లేదట. అంతెందుకు ఇప్పటివరకు జెడ్పీ పరిధిలో ఉన్న రేగొండ, గణపురం, టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి, భూపాలపల్లి మండలాల్లో జక్కుల శ్రీ హర్షిణి అడుగే పెట్టలేదంటే బెదిరింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చంటున్నారు ఆమె సన్నిహితులు. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం విషయంలో కూడా ఆహ్వానపత్రికలో జడ్పీ చైర్‌పర్సన్‌గా హర్షిణి పేరు లేదని, అధికారులు కూడా రాజకీయ ఒత్తిళ్లకు లొంగి పనిచేస్తున్నారని హర్షిణి వాపోతున్నారట.

దళితుల ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్న ప్రచారం జరుగుతున్న వేళ మంత్రి గంగుల పర్యటనలో మహిళ ప్రజాప్రతినిధిపై వివక్ష తేటతెల్లమైందన్న చర్చ మొదలైంది. జిల్లా జాయింట్ కలెక్టర్ స్వర్ణలత పేరుతో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌కు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబులకు ఆహ్వానం వెళ్లగా జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌గా శ్రీహర్షిణి పేరు ఇన్విటేషన్‌లో లేకపోవడం వివాదానికి తెర లేపుతోంది. శ్రీహర్షిణి దళిత ప్రజాప్రతినిధి కావడంతోనే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు రాజకీయ వివక్ష చూపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తగా కలెక్టర్ స్పందించి ఇన్విటేషన్‌లో శ్రీహర్షిణి పేరు చేర్చారు. దీనిపై స్పందించిన గండ్ర మాత్రం ఇదంతా కావాలని చేస్తున్నారే తప్ప తనకు జడ్పీ ఛైర్‌పర్సన్‌ శ్రీహర్షిణికి మధ్య ఎలాంటి విబేధాలు లేవంటూ కొట్టిపారేస్తున్నారు.

ఏమైనా భూపాలపల్లి జడ్పీఛైర్‌పర్సన్‌ శ్రీహర్షిణిపై మొదటి నుంచీ ఇదే చిన్నచూపు కనిపిస్తున్నదంటూ ఆమె వర్గీయులు వాపోతున్నారు. ఎక్కడ తమ గళం వినిపించాలనుకున్నా ఎమ్మెల్యే గండ్రతో ఇబ్బందులు తప్పడం లేదంటూ భయపడిపోతున్నారు. మరి ఈ పరిస్థితిని టీఆర్ఎస్ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories