Danam Nagender: పీయూష్ గోయల్ క్షమాపణలు చెప్పాల్సిందే

Danam Nagender: తెలంగాణ వస్తే ఉద్యమమంటే ఏంటో చూపిస్తాం

Shireesha
Published on: 23 Dec 2021 6:28 PM IST
TRS MLA Danam Nagender Comments On Piyush Goyal
X

 పీయూష్ గోయల్ క్షమాపణలు చెప్పాల్సిందే

Danam Nagender: రాష్ట్ర మంత్రులను అవమానపరిచిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తక్షణమే క్షమాపణ చెప్పాలని , లేనిపక్షంలో తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు. తెలంగాణ ప్రజల తిరుగుబాటు ఏవిధంగా ఉంటుందో , కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణకు వస్తే చూపిస్తారని అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ కానుకల కిట్లను నారాయణగూడ లోని బాప్టిస్ట్ చర్చ్ లో దానం పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే ఆదర్శమైన పథకం దళితబందు తీసుకొచ్చిన మహనీయుడు అని కొనియాడారు. ప్రతిపక్షాలు ఎన్నికల అనంతరం దళితబందు నిలిపివేస్తారని దృష్ప్రచారం చేశారని విమర్శించారు.

Shireesha

Shireesha

Next Story