Balka Suman: జబర్దస్త్ కమెడియన్ లా బండి సంజయ్ మాట్లాడుతున్నారు

TRS MLA Balka Suman Slams Congress and BJP Leaders
x

Balka Suman: జబర్దస్త్ కమెడియన్ లా బండి సంజయ్ మాట్లాడుతున్నారు

Highlights

Balka Suman: తెలంగాణలోని విపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ నేతలపై ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ఫైర్ అయ్యారు.

Balka Suman: తెలంగాణలోని విపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ నేతలపై ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ఫైర్ అయ్యారు. తెలంగాణ బీజేపీ నేతలు ఓ జోకర్ లా వ్యవహరిస్తున్నారన్న ఆయన.. తెలంగాణకు రాహుల్ గాంధీ వచ్చి కొత్తగా చేసేదేమీ ఉండదన్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి గడ్కరీ పర్యటన సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రసంగాన్ని ఆపార్టీ నేతలు అడ్డుకోవడాన్ని ఆయన తప్పుబట్టాడు. ఉత్తరాది సంస్కృతిని తెలంగాణకు తీసుకువస్తున్నారన్న ఆయన బీజేపీ నేతల ఈ బరితెగింపు తనం సరికాదన్నారు.

బీజేపీ నేతలు రజాకర్స్ ఫైల్స్, సినిమా తీస్తే.. తాము తంబాకు ఫైల్స్ సినిమా తిస్తామన్నారు. జబర్దస్ట్ కమెడియన్ లా బండి సంజయ్ మాట్లాడుతున్నారని సెటైర్ వేశారు. ఇక తన నియోజవర్గంలోని నేతలను కూడా గెలిపించుకోలేని రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి చేసిందేమీ లేదన్నారు. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి ఇంకా సమైక్యవాదులుగానే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. JNUలో దళిత విద్యార్థుల మీద దాడులు జరిగితే రాహుల్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories