బండి సంజ‌య్ నోరు అదుపులో పెట్టుకో : ‌బాల్క సుమ‌న్

బండి సంజ‌య్ నోరు అదుపులో పెట్టుకో : ‌బాల్క సుమ‌న్
x
Highlights

ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ అధికారిక సమావేశాన్ని బీజేపీ నేత బండి సంజయ్ రాజకీయం చేయడాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తప్పుబట్టారు. రాష్ర్ట...

ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ అధికారిక సమావేశాన్ని బీజేపీ నేత బండి సంజయ్ రాజకీయం చేయడాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తప్పుబట్టారు. రాష్ర్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాల‌ని బీజేపీ ఎంపీ బండి సంజ‌య్‌ను ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ హెచ్చ‌రించారు. నాడు తెలంగాణ రాష్ట్రం కోసం..నేడు అభివృద్ధి కోసం కేసీఆర్ పాటుబడుతున్నారని చెప్పారు. కేసీఆర్ పై బండి సంజయ్ విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారని బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ర్ట‌, కేంద్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య సంబంధాలు అనేకం ఉంటాయి.. వాటిలో భాగంగానే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లార‌ని తెలిపారు. ఈ విష‌యం కూడా తెలియ‌ని ఎంపీ బండి సంజ‌య్ సోయి లేకుండా ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నాడు. ప్ర‌జ‌ల‌కు కూడా వాస్త‌వాలు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ జీవితంలో ఎన్నో రకాల పదవులు అనుభవించిన వ్యక్తి కేసీఆర్.. ఆయన గురించి మాట్లాడే ముందు బండి సంజ‌య్‌ ఆచీ తూచి మాట్లాడాలి. స్థాయి లేని వాళ్లంతా.. కేటీఆర్ గురించి మాట్లాడ‌టం స‌రికాద‌న్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories