Nizamabad: నందిపేట్ రైతు వేదికలో మందు పార్టీ

Nizamabad: ఈరోజు ప్రారంభోత్సవం ఉండడంతో రాత్రిపూట సంబురాలు

Sandeep Eggoju
Published on: 19 July 2021 12:16 PM IST
TRS Leaders Secretly Celebrated Party in Nandipet Rythu Vedhika
X

నందిపేట రైతు వేదికలో మందు పార్టీ 

Nizamabad: నందిపేట్ రైతు వేదిక వైన్స్‌షాపు పక్కనే ఉండే పర్మిట్‌ రూమ్‌గా మారిపోయింది. ఈరోజు ప్రారంభోత్సవం ఉండడంతో స్థానిక టీఆర్ఎస్ నేతలు సిక్రెట్‌గా సంబురాలు జరుపుకున్నారు. రహస్యంగా రైతువేదికలోనే చిర్స్ అంటూ సిట్టింగ్‌ వేశారు. ఇలా ఫస్ట్‌ పెగ్గు పుచ్చుకున్నారో లేదో అంతలోనే స్థానిక బీజేపీ నేతలు వచ్చారు. రైతు వేదికలో మందు పార్టీ ఏంటని నిలదీశారు. ఇంకేముంది కట్‌ చేస్తే ఇరు పార్టీల కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఇక వీళ్ల గలాట చూసిన స్థానికులు వీళ్లేం నాయకులంటూ చీదరించుకున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story