ఎమ్మెల్యే రాకముందే టీఆర్‌ఎస్ నేతల భూమి పూజ
Raghunandan Rao: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో టీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది.
ఎమ్మెల్యే రాకముందే టీఆర్‌ఎస్ నేతల భూమి పూజ
Raghunandan Rao: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో టీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. లింగుపల్లి నుండి భూంపల్లి వరకు రోడ్డు మరమ్మత్తు పనులకు భూమిపూజ నిర్వహించే విషయంలో టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు రాకముందే రోడ్డు మరమ్మత్తు పనులకు టీఆర్‌ఎస్ నాయకులు భూమి పూజ నిర్వహించారు. ఎమ్మెల్యే రాకుండా పనులను ఎలా ప్రారంభిస్తారని టీఆర్‌ఎస్ నేతలతో బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
Next Story




