Etela Rajender: ఈటల వ్యాఖ్యలపై టీఆర్ఎస్‌ నేతల కౌంటర్

Etela Rajender: ఈటల తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం: పల్లా * కన్నతల్లి లాంటి పార్టీపై విమర్శలు చేశారు: పల్లా

Sandeep Eggoju
Updated on: 4 Jun 2021 4:03 PM IST
TRS leaders Counter on Etela Rajender Comments
X

ఈటెల వ్యాఖ్యలపై సపందించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Etela Rajender: ఈటల వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకమని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ ‌రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్ తర్వాత అన్ని పదవులు పొందిన నేతగా ఈటల ఉన్నారని గుర్తు చేశారు. పార్టీలో ఉన్నప్పుడు దేవుడు.. ఇప్పుడు దయ్యం, నియంత అయ్యరని పల్లా మండిపడ్డారు. అనామకుడు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించి విచారణకు ఆదేశించారంటే అదే ప్రజాస్వామ్యం గొప్ప అని పల్లా అన్నారు. ఈటల రాజేందర్‌ది నీది ఆత్మగౌరవం కాదని ఆస్తులపై మమకారమన్నారు పల్లా. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆత్మగౌరవ నినాదం తీసుకొచ్చారని చెప్పారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.

నీది ఆత్మగౌరవం కాదు.. ఆస్తులపై మమకారం పెంచుకున్నారు. సీఎంపై విమర్శలు సరికాదన్నారు. కరోనా సమయంలో ఈటలతో కలిసి సీఎం కేసీఆర్ ప్రతి సమావేశంలో కూర్చోన్నారని గుర్తు చేశారు. ప్రధానమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో చివరి నిమిషంలో వస్తారని.. అది ఆయన బద్ధకం అని తీవ్రంగా మండిపడ్డారు.

ప్రగతి భవన్‌లో ఆత్మగౌరవం దక్కలేదంటే తమను తాము కించపరుచుకున్నట్టేనని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు విమర్శించారు. ఈటల భూకబ్జాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిగిన తర్వాతే సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారని గువ్వల మండిపడ్డారు. అధికారులను వాడుకుని వారినే విమర్శించే స్థాయికి ఈటల ఎదిగరాని అన్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story