ఆదిలాబాద్‌లో అశ్లీల నృత్యాలు.. టీఆర్ఎస్‌తో పాటు పాల్గొన్న పలు పార్టీల నేతలు...

Adilabad: రికార్డింగ్ డ్యాన్సుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌...

Shireesha
Published on: 22 May 2022 7:33 AM IST
TRS Leaders and other Party Leaders Involved in Break Dances in Adilabad | Live News Today
X

ఆదిలాబాద్‌లో అశ్లీల నృత్యాలు.. టీఆర్ఎస్‌తో పాటు పాల్గొన్న పలు పార్టీల నేతలు...

Adilabad: ఆదిలాబాద్ పట్టణంలో అధికార పార్టీ నేత పుట్టినరోజు వేడుకల్లో అశ్లీల నృత్యాల బాగోతం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆఫీసర్స్ క్లబ్‌లో జరిగిన వేడుకల్లో టీఆర్ఎస్‌తో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నట్లు సమాచారం. మందు, విందు, చిందులతో హంగామా చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పుట్టిన రోజు వేడుకల్లో రికార్డింగ్ డ్యాన్సుల సంస్కృతి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆఫీసర్ క్లబ్‌లో రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించడంపై జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ రికార్డింగ్ డ్యాన్సుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Shireesha

Shireesha

Next Story