బీజేపీలో చేరిన స్వామిగౌడ్

Arun Chilukuri
Published on: 25 Nov 2020 8:21 PM IST
బీజేపీలో చేరిన స్వామిగౌడ్
X

గ్రేటర్ ఎన్నికలవేళ అధికార పార్టీ టీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. టీఆర్ఎస్ కీలక నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ బీజేపీలో చేరారు. ఢిల్లీ వెళ్లిన స్వామిగౌడ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కమలం గూటికి చేరారు. స్వామిగౌడ్‌కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జేపీ నడ్డా. ఇక, స్వామిగౌడ్ వెంట బీజేపీ నేతలు సీఎం రమేష్, రాంచంద్రరావు ఉన్నారు. బీజేపీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీలో చేరడం అంటే సొంత ఇంటికి వచ్చినట్లుందని.. బీజేపీని తన మాతృ సంస్థగా భావిస్తున్నట్లు చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మేయర్ పీఠం దక్కించుకునే అవకాశాలున్నాయని స్వామిగౌడ్‌ అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story