కేసీఆర్ ప్రధాని కావాలంటూ.. మద్యం,కోళ్లు పంచిన టీఆర్ఎస్‌ నేత..

Rajanala Srihari: వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజనాల శ్రీహరి అనే నాయకుడు హమాలీలకు మద్యం బాటిళ్లు, కోళ్లను పంపిణీ చేశారు.

Arun Chilukuri
Published on: 4 Oct 2022 4:49 PM IST
TRS Leader Rajanala Srihari Distributed Chicken And Liquor
X

కేసీఆర్ ప్రధాని కావాలంటూ.. మద్యం,కోళ్లు పంచిన టీఆర్ఎస్‌ నేత..

Rajanala Srihari: వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజనాల శ్రీహరి అనే నాయకుడు హమాలీలకు మద్యం బాటిళ్లు, కోళ్లను పంపిణీ చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దసరా రోజున కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించబోతున్నారు. ఈ సందర్భంగా.. కేసీఆర్ ఆ పార్టీకి అధ్యక్షుడు, దేశానికి ప్రధాని అవ్వాలని కోరుతూ.. వరంగల్‌కు చెందిన టీఆర్ఎస్‌ నేత రాజనాల శ్రీహరి వరంగల్ చౌరస్తాలో సుమారు 200 మంది హమాలీ కార్మికులకు కోళ్లు, మద్యం బాటిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు.

అధికార పార్టీలో ఉంటూ మద్యం పంపిణీ చేయడం అనేక విమర్శలకు దారితీస్తోంది. కాగా, కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించనున్న నేపథ్యంలో మద్యం బాటిళ్లు, కోళ్లను పంచిపెట్టడంపై పలువురు ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి దీనిపై స్పందిస్తూ.. కేసీఆర్ ని ప్రధాన మంత్రిని చేయడానికి టీఆర్ఎస్ నేతలు మద్యం, కోళ్లను పంపిణీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ''ఇది మీ ఐడియానేనా కేటీఆర్ గారూ?'' అంటూ నిలదీశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story