Telangana: టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

Telangana: చేతకానివారు, రూపాయి సహాయం చేయనివారు చాలా మాట్లాడుతారు -కడియం

Sandeep Eggoju
Updated on: 21 March 2021 1:56 PM IST
TRS Leader Kadiyam Srihari Sensational Comments
X

కడియం శ్రీహరి (ఫైల్ ఫోటో)

Telangana: టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చేతకానివారు, ఒక్క రూపాయి కూడా సహాయం చేయనివారు చాలా మాట్లాడుతారని.. చెల్లని రూపాయి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరి దగ్గర ఛాయి తాగినా. పదవి ఇప్పిస్తాననో... పనులు ఇప్పిస్తాననో ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపించినా ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. పదవులు అమ్ముకుంటున్నారు, పనులు అమ్ముకుంటున్నారని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నెత్తిమీద పది రూపాయలు పెడితే అమ్ముడు పోనివారు కూడా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story