యాసంగి పంట కొనుగోలుపై పార్లమెంట్‌ ముందు ధర్నాకు సిద్ధమవుతున్న టీఆర్ఎస్

TRS: ఎంపీలు అందరూ ధర్నాలో పాల్గొనాలి- సీఎం కేసీఆర్

Sandeep Eggoju
Published on: 28 Nov 2021 7:57 PM IST
TRS is Ready for Protest in Front of Parliament for On the Purchase of Crop
X
యాసంగి వడ్ల కొనుగోలుపై పార్లమెంట్ ముందు ధర్నాకు సిద్దమవుతున్న తెరాస (ఫైల్ ఇమేజ్)

TRS: యాసంగి పంటల కొనుగోలుపై పార్లమెంట్‌ ముందు ధర్నా చేయాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఎంపీలందరూ ధర్నాలో పాల్గొనాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం, రాష్ట్ర బీజేపీ నేతల బండారం బయటపడిందన్నారు సీఎం కేసీఆర్. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు ఏవి వేయాలనేది కేబినెట్ భేటీ తర్వాత రైతులకు వివరిస్తానన్నారు.

ఇక రైతు చట్టాల రద్దు బిల్లును స్వాగతించాలన్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రైతుల ఇష్యూను పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టాలని సూచించారు. విద్యుత్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాలని విద్యుత్ బిల్లు విషయంలో మిగతా ప్రాంతీయ పార్టీల స్టాండ్‌ను కూడా పరిశీలించాలన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story