Warangal: రౌడీలకు, గుండాలకు టీఆర్ఎస్ టిక్కెట్లు- బండి సంజయ్

Warangal: రౌడీషీటర్లు, గుండాలకు, నగర బహిష్కరణ గురైన వ్యక్తులకు టీఆర్ఎస్‌ టికెట్లు ఇచ్చిందని విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.

Arun Chilukuri
Updated on: 24 April 2021 8:30 PM IST
TRS Given Tickets to Goondas and Rowdies Says Bandi Sanjay
X

Warangal: రౌడీలకు, గుండాలకు టీఆర్ఎస్ టిక్కెట్లు- బండి సంజయ్

Warangal: రౌడీషీటర్లు, గుండాలకు, నగర బహిష్కరణ గురైన వ్యక్తులకు టీఆర్ఎస్‌ టికెట్లు ఇచ్చిందని విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కబ్జాలపై ఇక్కడి ఎమ్మెల్యేలకు కోచింగ్ ఇచ్చేది సీఎం కేసీఆరే అని ఆరోపించారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్‌లోనే ఎక్కువ కబ్జాలు పెరిగాయని విమర్శించిన ఆయన.. టీఆర్ఎస్ నేతలు తప్పుడు అభ్యర్థులను ఎంపిక చేశామని భద్రకాళీ గుడి వద్ద ముక్కునేలకు రాయాలన్నారు. ఓరుగల్లు ప్రజల్లో కాకతీయుల రక్తం ప్రవహిస్తోందని పౌరుషాల గడ్డగా పేరొంది‌న ఓరుగల్లు ప్రజలు ఈ ఎన్నికల్లో కబ్జాకోరులను అడ్డుకుంటారని వ్యాఖ్యానించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story