Flag Festival: తెలంగాణ వ్యాప్తంగా వాడవాడలా టీఆర్ఎస్‌ జెండా పండగ

Flag Festival: తెలంగాణ వ్యాప్తంగా వాడవాడలా టీఆర్ఎస్‌ జెండా పండగ వేడుకలా జరుగుతోంది

Sandeep Eggoju
Published on: 2 Sept 2021 11:16 AM IST
TRS Flag Festival in All Over Telangana
X

తెలంగాణ వ్యాప్తంగా తెరాస జెండా పండుగ వేడుకలు (ఫైల్ ఇమేజ్)

Flag Festival: తెలంగాణ వ్యాప్తంగా వాడవాడలా టీఆర్ఎస్‌ జెండా పండగ వేడుకలా జరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీ జెండా పండగ సందర్భంగా పలు వార్డులలో మంత్రి హరీష్‌రావు టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.

సికింద్రాబాద్‌ బన్సీలాల్‌పేటలో టీఆర్ఎస్ జెండా పండగ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. బన్సీలాల్‌పేట డివిజన్ కార్పొరేటర్‌ హేమలతతో కలిసి పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీఆర్ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ జెండా పండగ కార్యక్రమం గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహిస్తున్నారు టీఆర్ఎస్‌ శ్రేణులు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌ టీఆర్ఎస్‌ జెండాను ఆవిష్కరించారు. 2001లో టీఆర్ఎస్‌ పార్టీని ఒక్కడుగా స్థాపించిన కేసీఆర్‌.. ఇప్పుడు లక్షలాది మంది కార్యకర్తలున్నారన్నారు ఎమ్మెల్యే సుంకే రవి శంకర్.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story