కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు

Nallala Odelu: అధికార టీఆర్ఎస్‌కు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు.

Arun Chilukuri
Updated on: 19 May 2022 5:18 PM IST
TRS EX MLA Nallala Odelu Joins in Congress Party
X

కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు

Nallala Odelu: అధికార టీఆర్ఎస్‌కు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. జెడ్పీ చైర్మన్ అయిన తన సతీమణి భాగ్యలక్ష్మితో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్లారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి ఉదయాన్నే ఢిల్లీకి వెళ్లిన ఓదెలు.. ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపటి క్రితం ప్రియాంక గాంధీ సమక్షంలో వారు కాంగ్రెస్‌లో చేరారు.

ఓదెలు 2009, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్‌ తరఫున ఆయన విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2010లో జరిగిన ఉప ఎన్నికలోనూ ఆయన గెలుపొందారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రభుత్ విప్‌గానూ ఓదెలు పనిచేశారు. భాగ్యలక్ష్మికి జడ్పీఛైర్‌పర్సన్‌ పదవీకాలం ఇంకా రెండేళ్లకు పైనే ఉంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story