ఎల్బీ స్టేడియంలో గులాబీ ధూంధాం

ఎల్బీ స్టేడియంలో గులాబీ ధూంధాం
x
Highlights

గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 28న ఎల్బీస్టేడియంలో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ ఏర్పాటు చేశారు పార్టీ శ్రేణులు. ఈ సభలో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు....

గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 28న ఎల్బీస్టేడియంలో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ ఏర్పాటు చేశారు పార్టీ శ్రేణులు. ఈ సభలో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. హైదరాబాద్‌ నగర అభివృద్ధికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో క్లారిటీ ఇవ్వనున్నారు. సభ ఏర్పాట్లను మంత్రులు కేటీఆర్, తలసాని పరిశీలించారు. ప్రతి డివిజన్‌ నుంచి కార్యకర్తలు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. సుమారు 25 వేల మంది టీఆర్‌ఎస్‌ సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మరోవైపు 100కు పైగా స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కసరత్తు ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను సీపీ అంజనీ కుమార్‌, ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్‌ రెడ్డి, పార్టీ నేత కర్నె ప్రభాకర్‌ను అడిగి తెలుసుకున్నారు. సభ సందర్భంగా స్టేడియం లోపల, చుట్టుపక్కల భద్రతా ఏర్పట్లకు సంబంధించిన అంశాలను సీపీ అంజనీ కుమార్‌ వివరించారు. అదేవిధంగా సభా వేదికను మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories