కాంగ్రెస్, బీజేపీ ఉత్సాహంపై నీల్లు చల్లే వ్యూహం.. కేసీఆర్ కౌంటర్ ఆపరేషన్..

Counter Operation: కాంగ్రెస్, బీజేపీ ఉత్సాహంపై నీల్లు చల్లే వ్యూహాన్ని ఓ రేంజ్ లో ఆవిష్కరిస్తోంది కారు పార్టీ.

Arun Chilukuri
Updated on: 11 May 2022 5:00 PM IST
TRS Counter Operation on Congress and BJP
X

కాంగ్రెస్, బీజేపీ ఉత్సాహంపై నీల్లు చల్లే వ్యూహం.. కేసీఆర్ కౌంటర్ ఆపరేషన్..

Counter Operation: కాంగ్రెస్, బీజేపీ ఉత్సాహంపై నీల్లు చల్లే వ్యూహాన్ని ఓ రేంజ్ లో ఆవిష్కరిస్తోంది కారు పార్టీ. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ టూర్ తర్వాత అంతే దూకుడుగా ప్రజల్లోకి వెళ్తోంది. పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీశ్ జిల్లా టూర్లతో కేడర్లో జోష్ నింపుతున్నారు. ఓవైపు ముఖ్యనేతలు మరోవైపు మంత్రులు టూర్లతో హడావుడి పెంచుతున్నారు. సభలతో సంక్షేమ పథకాల ఘనత టీఆర్ఎస్ సర్కారుదేనంటూ వల్లెవేస్తున్నారు. ప్రతి పక్షాలు స్ట్రాంగ్‌గా ఉన్న చోట కౌంటర్ ఆపరేషన్లతో పార్టీ నేతల్లో ఉత్సాహం నింపుతున్నారు.

రాహుల్ గాంధీ వరంగల్ సభ తర్వాత కేటీఆర్ టూర్, చేసి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ వల్ల ఒరిగేదేం లేదన్న ఫీలింగ్ కలిగిస్తున్నారు. మరోవైపు బీజేపీ చీఫ్ బండి సంజయ్ నారాయణపేట పాదయాత్ర తర్వాత కేటీఆర్ పర్యటిస్తే వరంగల్ భూపాలపల్లిలో సభల్లో హరీశ్ రావు పాల్గొని కేడర్ కు భరోసా ఇస్తున్నారు. బండి సంజయ్ పాదయాత్ర రూట్‌లో టీఆర్ఎస్ ప్యాచప్ చేసుకుంటోంది. రాహుల టూర్ తర్వాత ఉమ్మడి వరంగల్‌లో కార్యక్రమాలు చేపట్టింది. ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇస్తూనే సంక్షేమంపై భరోసా ఇస్తోంది అధికార పార్టీ. తెలంగాణకు టీఆర్ఎస్ శ్రీరామరక్ష అంటూ నేతలు ప్రసంగాలు విన్పిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story