జోగులాంబ గద్వాల జిల్లా టీఆర్‌ఎస్‌లో వర్గపోరు

*ఎమ్మెల్యే కుమారుడు అజయ్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ వర్గాల మధ్య వైరం

Jyothi
Updated on: 20 Sept 2022 12:45 PM IST
TRS Clashes Between Jogulamba Gadwal District
X

జోగులాంబ గద్వాల జిల్లా టీఆర్‌ఎస్‌లో వర్గపోరు

Jogulamba Gadwal: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే అబ్రహం కుమారుడు అజయ్ కుమార్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయిలో వైరం కొనసాగుతుంది. మొన్న సాయిచంద్‌పై జరిగిన దాడితో నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాడుల అనంతరం తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అటు ఎమ్మెల్యే అబ్రహాం, ఇటు సాయిచంద్ చెప్పుకున్నప్పటికీ.. అంతర్గతంగా మాత్రం పోరు అలాగే కొనసాగుతోంది. ఇవాళ సాయిచంద్ పుట్టినరోజు కావడంతో నియోజకవర్గంలో ఆయన మద్దతుదారులు సాయిచంద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పలు ప్రాంతాల్లో పోస్టర్లు వేశారు. అయితే.. అర్ధరాత్రి సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.. వాటిని చించేశారు. దీంతో గ్రామంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

Jyothi

Jyothi

Next Story