Nagarjuna Sagar Bypoll: దూసుకుపోతున్న కారు.. 11,581 ఓట్ల ఆధిక్యంలో నోముల భ‌గ‌త్

Nagarjuna Sagar Bypoll: రౌండు రౌండుకీ పెరుగుతున్న ఆధిక్యతతో టీఆర్ఎస్‌‌ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునే దిశగా దూసుకెళ్తోంది.

Arun Chilukuri
Published on: 2 May 2021 1:31 PM IST
TRS candidate Nomula Bhagath Leads 11,581 Votes in Nagarjuna Sagar bypoll
X

తెరాస కరుగుర్తు 

Nagarjuna Sagar Bypoll: నాగార్జున సాగర్‌ లో అధికార పార్టీ దూకుడు చూపిస్తోంది. రౌండు రౌండుకీ పెరుగుతున్న ఆధిక్యతతో టీఆర్ఎస్‌‌ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు జరిగిన అన్ని రౌండ్ల ఓట్ల లెక్కింపులోనూ దాదాపు టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌‌దే ఆధిక్యం. రెండో స్థానంలో ఉన్న హస్తం పార్టీ ఆరంభంలో కాస్త గట్టి పోటీ ఇచ్చినా.. రౌండ్ రౌండ్ మారే కొద్దీ వెనుకబడుతూనే ఉంది.

టీఆర్ఎస్‌‌కు ఏ మాత్రం పోటీ ఇచ్చేలా కనిపించడం లేదు ఆ పార్టీ. ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ 17వ రౌండ్ ముగిసేస‌రికి 11,581 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వ‌రుస‌గా తొలి తొమ్మిది రౌండ్ల‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ ఆధిక్యం ప్ర‌ద‌ర్శించ‌గా, 10, 11, 14వ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story