బైపోల్‌ ప్రచారానికి ఏపీ వైసీపీ నేత‌లు రాబోతున్నారా?

బైపోల్‌ ప్రచారానికి ఏపీ వైసీపీ నేత‌లు రాబోతున్నారా?
x
Highlights

హుజూర్ న‌గ‌ర్‌లో ప్రచారానికి ఏపీ వైసీపీ నేత‌లు రాబోతున్నారా సెటిల‌ర్లు ఎక్కువ‌గా ఉండే హుజూర్ న‌గ‌ర్‌లో క‌మ్మ‌, కాపు లీడ‌ర్లతో ప్రచారం చేయించాల‌ని...

హుజూర్ న‌గ‌ర్‌లో ప్రచారానికి ఏపీ వైసీపీ నేత‌లు రాబోతున్నారా సెటిల‌ర్లు ఎక్కువ‌గా ఉండే హుజూర్ న‌గ‌ర్‌లో క‌మ్మ‌, కాపు లీడ‌ర్లతో ప్రచారం చేయించాల‌ని టీఆర్‌ఎస్ భావిస్తోందా క్షేత్రస్థాయిలో ప‌రిస్థితులు అనుకున్నంత ఈజీగా లేక‌పోవ‌టంతో, కులాల వారీగా ప్రచారాల‌కు తెర‌లేపాల‌ని గులాబీ నేతలు అనుకుంటున్నారా వైసీపీ ఎమ్మెల్యేల‌తో పూర్తిస్థాయిలో ప్రచారం చేయించడానికి టీఆర్‌ఎస్ ప్లాన్ చేస్తోందా?

హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల‌కు సింగిల్‌గా వెళ్ళేందుకు జంకుతోంది టీఆర్ఎస్‌. ఇప్పటి వరకు ఎక్కడ ఉప ఎన్నిక‌లు జ‌రిగినా, అవి త‌మ‌కే అనుకూలంగా ఉంటాయ‌ని భావించే టీఆర్ఎస్ హుజూర్ న‌గ‌ర్ లో అస‌లు పోటే లేద‌ని అనుకుంది. తీరా గ్రౌండ్ లోకి వెళితే అక్కడ ప‌రిస్థితులు తారుమారుగా ఉన్నాయనే అంచనాకొచ్చారు. దీంతో అందుబాటులో ఉన్న అన్ని అవ‌కాశాల‌ను ఉప‌యోగించుకునేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నారు.

ఇప్పటికే సీపీఐ నేత‌లతో పొత్తుల‌పై చ‌ర్చలు జ‌రిపిన టీఆర్ఎస్ నేత‌లు, ఆయా సామాజిక వ‌ర్గాల ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టారు. సామాజికవ‌ర్గాల వారీగా అదే కులానికి చెందిన ఎమ్మెల్యే, మంత్రుల‌ను, ఇంచార్జీలుగా నియ‌మించిన పార్టీ ముఖ్యనేత‌లు, ఆ నియోజ‌క‌వ‌ర్గంలోని క‌మ్మ‌, కాపు ఓట్లపై దృష్టి సారించారు. కాపుల్లో టీఆర్‌ఎస్‌పై కొంత సానుకూల‌త ఉన్నా క‌మ్మ సామాజిక వ‌ర్గం ఓట‌ర్లలో పూర్తి వ్యతిరేక‌త ఉన్నట్లు టీఆర్ఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. దీంతో ఈ రెండు సామాజిక వర్గాల ఓట‌ర్లను ద‌గ్గర చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు గులాబీ నేత‌లు.

హుజూర్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో క‌మ్మ‌, కాపు ఓట‌ర్ల ప్రభావం అధికంగా ఉంటుంది. దీంతో ఏపీలోని ఆయా సామాజిక వ‌ర్గాల ఎమ్మెల్యేల‌ను రంగంలోకి దించి, ఆయా మండ‌లాల్లో ప్రచారం చేయించాల‌ని టీఆర్ఎస్‌ అధిష్టానం భావిస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలో క‌మ్మలు 11 వేల ఓట‌ర్లు ఉండ‌గా, కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ఓట‌ర్లు ఏడు వేల మంది ఉన్నారు. ఈ రెండు సామాజిక వ‌ర్గాల ఓట్లు టార్గెట్‌గా కాపు, క‌మ్మ సామాజిక వ‌ర్గాల ఎమ్మెల్యేల‌ను ప్రచారానికి పంపాల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్‌కు విజ్ణప్తి చేసిన‌ట్లు తెలుస్తోంది. ద‌స‌రా పండుగ త‌ర్వాత ప‌ది రోజుల పాటు ఏపీ ఎమ్మెల్యేలు ఇక్కడే ఉండేందుకు టీఆర్‌ఎస్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

టీఆర్‌ఎస్ నేత‌లు మిగ‌తా సామాజిక వ‌ర్గాల ఓటర్లను సైతం విశ్లేశించుకుంటున్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన అభ్యర్థులు, రంగంలో ఉండ‌టంతో ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన ఓట్లు ఎవ‌రికి ప‌డుతాయ‌నే చ‌ర్చ టీఆర్‌ఎస్ లో జ‌రుగుతోంది. రెడ్డి సామాజిక వ‌ర్గం ఓట్లు 27 వేలు ఉండ‌టంతో, గెలుపోట‌ములు నిర్దేశించే ఓటు బ్యాంకుగా ప‌రిగ‌ణిస్తున్నారు. సైది రెడ్డి క‌న్నా ప‌ద్మావతి బాధ్యత‌లు భుజాన వేసుకున్న ఉత్తమ్ బలంగా క‌నిపిస్తుండ‌టంతో, ఈ సామాజిక వ‌ర్గానికి చెందిన ఓట‌ర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపొచ్చనే అంచ‌నా వేస్తున్నారు గులాబీ నేత‌లు. ఇక భారీగా ఉన్న బీసీ ఓటర్లను మిస్ చేసుకోవ‌ద్దని భావిస్తున్నారు గులాబీ నేత‌లు.

ఇక‌ బీజేపీ అభ్యర్థి పెరిక సామాజిక వ‌ర్గం కావ‌టంతో బీసీ ఓట్లు చీలొచ్చని గులాబీ నేత‌లు భావిస్తున్నారు. బీసీ సామాజిక వ‌ర్గంలో గౌడ, యాద‌వ‌ వ‌ర్గానికి చెందిన ఓట్లు మొత్తం 33 వేలు ఉండ‌టంతో, ఈ రెండు సామాజికవ‌ర్గ ఓటర్లను ఆక‌ర్షించేందుకు నేత‌లంతా వారిని క‌లవాల‌ని భావిస్తున్నారు. ఆయా సామాజిక వ‌ర్గాల‌కు చేరుతున్న ప్రభుత్వ ప‌థ‌కాల‌ను వివ‌రించాల‌ని ఆయా సామాజికవ‌ర్గాల‌కు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల‌కు సూచించారు సీఎం కేసీఆర్‌. అక్టోబ‌ర్ 4, 10, 11, 15 తేదీల్లో కేటీఆర్ రోడ్డు షోలు నిర్వహించ‌నున్నట్లు తెలుస్తోంది. అక్టోబ‌ర్ 17 లేదా 18న కేసీఆర్ భారీ భ‌హిరంగ స‌భ నిర్వహించేందుకు ప్రణాళిక సిధ్ధం చేస్తున్నారు.

మొత్తానికి హుజూర్‌ నగర్‌లో పరిస్థితులను అంచనా వేసి, అప్రమత్తమైనట్టు కనిపిస్తోంది టీఆర్ఎస్. గెలిచేందుకు ఉన్న అవ‌కాశాల‌నూ ఉప‌యోగించుకునేందుకు ప్రయ‌త్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే, వైసీపీ నేతలను సైతం ప్రచారానికి ఆహ్వానించాలని భావిస్తున్నారు. అయితే, గతంలో చంద్రబాబు తెలంగాణలో ప్రచారం చేయడాన్ని ఆయుధంగా మలచుకున్నారు కేసీఆర్. మరి అదే ఏపీ నేతలతో తెలంగాణలో ప్రచారం చేయిస్తే, మరి విపక్షాలు సైతం అస్త్రంగా ప్రయోగించే అవకాశముంది. చూడాలి, అందరిలోనూ బీపీ పెంచుతున్న హుజూర్‌ నగర్‌ బైపోల్‌‌లో, పార్టీల ఎత్తులు పైఎత్తులు ఇంకే రేంజ్‌లో వుంటాయో.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories