Nagarjuna Sagar: ఉప ఎన్నిక అభ్యర్థుల ఎంపికపై టీఆర్ఎస్‌, బీజేపీ కసరత్తు

Nagarjuna Sagar: నేడు టీఆర్ఎస్‌, బీజేపీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్‌

Sandeep Eggoju
Published on: 28 March 2021 9:47 AM IST
TRS‌, BJP Arrangements Selection of Candidates for the By-Election
X

తెరాస & బీజేపీ (ఫైల్ ఇమేజ్)

Nagarjuna Sagar: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా మారింది. నాగార్జున సాగర్‌ ఉపఎన్నికలో సత్తా చాటే పార్టీ ఎవరన్న ఉత్కంఠ పెరుగుతోంది. త్రిముఖ పోరా.. బహుముఖ పోటీయా అన్నది తేలకపోయినా హోరాహోరీగా ఉపఎన్నిక సాగుతుందన్నది సుస్పష్టం. మాజీ మంత్రి జానారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్‌ నుంచి ఎన్నికల గోదాలోకి దిగేశారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌, బీజేపీ శిబిరాల నుంచే ఎలాంటి ఉలుకు పలుకు లేదు. ఇంకా అభ్యర్థుల ఎపింకపైనే కసరత్తు చేస్తున్నాయి. టీఆర్‌ఎస్‌, బీజేపీలు వేస్తున్న ఎత్తుగడలు ఆసక్తిగా మారింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story