హీట్ పుట్టిస్తోన్న గ్రేటర్ ఎన్నికలు

హీట్ పుట్టిస్తోన్న గ్రేటర్ ఎన్నికలు
x
Highlights

ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిందో లేదో.. హైదరాబాద్‌‌లో పాలిటిక్స్‌ హీటెక్కాయి. గ్రేటర్ ఫైట్ ఆరంభంలోనే టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. వరద సాయం ఆపారని టీఆర్ఎస్‌.. ఆపాల్సిన అవసరం మాకేంటంటూ బీజేపీ విరుచుకుపడుతున్నాయి.

ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిందో లేదో.. హైదరాబాద్‌‌లో పాలిటిక్స్‌ హీటెక్కాయి. గ్రేటర్ ఫైట్ ఆరంభంలోనే టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. వరద సాయం ఆపారని టీఆర్ఎస్‌.. ఆపాల్సిన అవసరం మాకేంటంటూ బీజేపీ విరుచుకుపడుతున్నాయి.హైదరాబాద్‌ గ్రేటర్ ఎలక్షన్‌ దుబ్బాక ఉపఎన్నికను తలపిస్తోంది. నామినేషన్లు కూడా పూర్తి కాకుండానే బీజేపీ, టీఆరెస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో వరద సహాయంపై వివాదం రాజుకుంది. వరదలతో నష్టపోయిన పేదలకు డబ్బులు ఇస్తుంటే.. దాన్ని ఆపేసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని గులాబీ బాస్ ధ్వజమెత్తారు. వరద సహాయాన్ని నిలిపివేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని ఆరోపించారు. ఇదే విషయాన్ని ప్రచారంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు కేసీఆర్‌.

ఇక కేసీఆర్ ఆరోపణలకు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన పేరుతో ఫోర్జరీ లేఖను సృష్టించి పత్రికలకు విడుదల చేసినది కేసీఆరేనని ఆరోపించారు. ఈ విషయంలో చార్మినార్ లోని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు బండి సంజయ్‌.

ఇక సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న లెటర్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బండి సంజయ్‌. ఫోర్జరీకి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే అసలు వరద సహాయంపై ఈసీకి బండి సంయ్ లేఖ రాశారా? లేదా? సంతకం ఫోర్జరీలో నిజమెంత..? అనేది సస్పెన్స్‌గా మారింది.

ఇక గ్రేటర్ ఎన్నికల ఆరంభంలోనే బీజేపీ, టీఆర్ఎస్‌ మధ‌్య మాటల యుద్ధం కొనసాగటంతో.. దుబ్బాక పరిస్థితే ఇక్కడ కూడా రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. దుబ్బాకలో కూడా బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్యే పోటీ ఉండగా.. అక్కడా ఇలాంటి సవాళ్లు, విమర్శలతో రెండు పార్టీలు హీట్ పుట్టించాయి. కాంగ్రెస్‌ మూడో స్థానానికి పరిమితమైంది. ప్రస్తుతం గ్రేటర్‌ ఎలక్షన్‌లోనూ అధికార టీఆర్ఎస్‌.. బీజేపీనే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories