Bandi Sanjay: బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్‌పై టీఆర్ఎస్‌ శ్రేణులు దాడి

Bandi Sanjay: గుడ్ల, రాళ్లతో దాడి టీఆర్ఎస్‌ శ్రేణులు దాడి చేశారు.

Sandeep Eggoju
Updated on: 15 Nov 2021 2:38 PM IST
TRS Activists Attack on Bandi Sanjay Convoy with Eggs and Stones
X
బండి సంజయ్ కాన్వయ్ పై దాడి చేసిన టీఆరెఎస్ శ్రేణులు

Bandi Sanjay: నల్గొండ జిల్లాలో టెన్షన్‌ నెలకొంది. టీ.బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆర్జాలబావి దగ్గర ఐకేపీ సెంటర్‌లో కొనుగోళ్లను బండి సంజయ్‌ పరిశీలిస్తుండగా బీజేపీ, టీఆర్ఎస్‌ శ్రేణుల మధ్య ఒక్కసారిగా తోపులాట జరిగింది. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా టీఆర్ఎస్‌ కార్యకర్తలు నినాదాలు చేశారు. బండి సంజయ్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. అంతేకాదు సంజయ్‌ పర్యటనను అడుగడునా అడ్డుకునే ప్రయత్నం చేశారు.

మరోవైపు బండి సంజయ్‌ను అడ్డుకోవడంపై బీజేపీ కార్యకర్తలు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి చేయడంతో కాషాయ నేతలు మండిపడుతున్నారు. నిరసనగా జాతీయ రహాదారిపై బైటాయించారు. వరి రైతుల సమస్యలు, ఇబ్బందులను తెలుసుకోవడానికి వస్తే ఇలాంటి చర్యలకు పాల్పడుతారా అంటూ ఫైర్‌ అవుతున్నారు. నల్లజెండాలతో నిరసన తెలపడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story