Mahabubabad: తహశీల్దార్ మాట్లాడుతుండగానే దాడికి దిగిన గిరిజన యువకులు..

Mahabubabad: సాలార్‌తండా సమీపంలోని సర్వే నెం 255లో పరిశీలనకు వెళ్లిన తహశీల్దార్

Shekhar G
Published on: 18 Jun 2023 7:22 PM IST
Tribal People Attack On Tehsildar In Mahabubabad District
X

Mahabubabad: తహశీల్దార్ మాట్లాడుతుండగానే దాడికి దిగిన గిరిజన యువకులు.. 

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో తహశీల్దార్‌పై గిరిజన రైతులు దాడికి దిగారు. సాలార్‌తండా సమీపంలోని సర్వే నెం 255లో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం భూమిని కేటాయించగా.. స్థలం పరిశీలనకు తహశీల్దార్ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ సిబ్బందిని గిరిజనులు అడ్డుకున్నారు. తహశీల్దార్ మాట్లాడుతుండగానే. కొందరు గిరిజన యువకులు దాడి చేసినట్లు తెలుస్తోంది. గిరిజనుల దాడిలో తహశీల్దార్ చొక్కా చిరికి పోయింది. అంతటితో ఆగకుండా ప్రభుత్వ సిబ్బందిపై సైతం రాళ్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story