
ట్రీ సిటీ హైదరాబాద్ (ఫోటో ది హన్స్ ఇండియా)
* హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ ఖ్యాతి * ట్రీ సిటీగా హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు
విశ్వనగరంగా పేరొందిన హైదరాబాద్ కీర్తిలో మరో కలికితురాయి వచ్చి చేరింది. హైదరాబాద్ నగరం 'ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్' గా గుర్తింపు సాధించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తో కలిసి పనిచేసే అర్బోర్ డే ఫాండేషన్ హైదరాబాద్‌కు ఈ బిరుదునిచ్చింది. హైదరాబాద్‌తో పాటు 63 దేశాల్లోని 120 నగరాలు గ్లోబల్‌గా ఈ గుర్తింపు దక్కించుకున్నాయి. పచ్చదనం, గ్రీనరీ లో ఉత్తమ ఫలితాలు సాధిస్తోన్న భాగ్యనగరానికి ఈ గుర్తింపు దక్కడం పట్ల రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌లో గత కొన్నేళ్లుగా కోట్లాది మొక్కలను నాటడంతో పాటు వాటి మనుగడకు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. గ్రేటర్ హైదరాబాద్ లో చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ ల ఏర్పాటు, ఎవెన్యూ ప్లాంటేషన్, కార్యాలయాలు, విశ్వవిద్యలయాలు, పాఠశాలలు, ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున చేపట్టిన హరితహారం ప్లాంటేషన్ వివరాలను ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ -2020 గుర్తింపుకు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ ప్రతిపాదనలు పంపింది.
హరితహారంలో భాగంగా గత నాలుగేళ్లుగా హైదరాబాద్‌లో 2,76,97,967 మొక్కలను నాటడం, పంపిణీ చేయడం జరిగింది. 2016 నుంచి 2020 వరకు 3 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యానికి గాను 86.28 శాతం మొక్కలు పంపిణీ, నాటడం జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రెండున్నర కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యానికి గాను 2.08 కోట్ల మొక్కలను పంపిణీ, నాటడం జరిగింది. నగరంలోని 65 ప్రాంతాల్లో యాదాద్రి మోడల్ మియావాకి ప్లాంటేషన్‌ను చేపట్టారు. 19 మేజర్ పార్కులు, 17 థీమ్ పార్కులు, 919 కాలనీ పార్కులు, 105 సెంట్రల్ మీడియన్‌లు, 66 ట్రాఫిక్ ఐ-లాండ్‌లు, 18 ఫ్లైఓవర్లు, 327 ట్రీ ఫార్కులను ప్రత్యేకంగా ఏర్పాటు

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




