తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ

Telangana: దాదాపు 50 మందికిపైగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది

Jyothi
Published on: 26 Jan 2023 7:12 AM IST
Transfer of IPS in Telangana
X

తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ

Telangana: తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేసింది. దాదాపు 50 మందికిపైగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులను వెల్లడించనుంది. నల్లగొండ, సిరిసిల్ల, వనపర్తి, మహబూబ్‌నగర్ ఎస్పీలను బదిలీ చేయనున్నట్టు తెలుస్తోంది. కరీంనగర్, రామగుండం పోలీస్ కమిషనర్లను కూడా బదిలీ చేయబోతున్నట్టు సమాచారం. రామగుండం సీపీగా సుబ్బారాయుడు నియామకం జరిగినట్టు తెలుస్తోంది. ఇక హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి డీసీపీగా జానకి ధరావత్‌ను నియమించింది ప్రభుత్వం. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా రాజీవ్ రతన్ నియమితులయ్యారు. ఖమ్మం సీపీగా సురేశ్‌ను నియమించగా, జగిత్యాల ఎస్పీగా భాస్కర్‌ను నియమించారు.

Jyothi

Jyothi

Next Story