logo
తెలంగాణ

Telangana: 30 మంది ఐపీఎస్‌ల బదిలీ.. హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్

Transfer of 30 IPS Officers Orders were Issued by the Telangana Government
X

హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్

Highlights

*ఉత్తర్వులను జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం *ఏసీపీ డీజీగా అంజనీకుమార్

Telangana: తెలంగాణలో 30 మంది ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. పోలీసు అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్, ఏసీబీ డీజీగా అంజనీకుమార్, ఏసీబీ డైరెక్టర్గా శిఖా గోయల్, హైదరాబాద్ జాయింట్ సీపీ (క్రైమ్స్)గా ఏఅర్ శ్రీనివాస్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా రంగనాథ్ బదిలీ అయ్యారు.

ఇక నల్గొండ ఎస్పీగా రామ రాజేశ్వరి, సిద్దిపేట్ సీపీగా శ్వేత, హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీగా జోయల్ డేవిస్, మెదక్ ఎస్పీగా రోహిణి ప్రియదర్శిని, సైబరాబాద్ డీసీపీగా కల్మేశ్వర్, సైబరాబాద్ జాయింట్ సీపీగా అవినాష్ మహంతి, హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా చందనా దీప్తి, హైదరాబాద్ సీసీఎస్‌ డీసీపీగా గజరావు భూపాల్, హైదరాబాద్ ఎస్బీఐ జాయింట్ సీపీగా విశ్వప్రసాద్, వికారాబాద్ ఎస్పీగా కోటిరెడ్డి, మాదాపూర్ జోన్ డీసీపీగా శిల్పవల్లిని నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Web TitleTransfer of 30 IPS Officers Orders were Issued by the Telangana Government
Next Story