స్టేషన్ ఘనపూర్ లో తప్పిన రైలు ప్రమాదం

Arun Chilukuri
Published on: 2 March 2021 5:48 PM IST
Train Mishap at station Ghanpur
X

స్టేషన్ ఘనపూర్ లో తప్పిన రైలు ప్రమాదం 

జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ దగ్గర ధనాపూర్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయాయి. ఇంజిన్ ముందుకు వెళ్లిపోవడంతో ఘన్‌పూర్ రైల్వే గేట్ వద్ద బోగీలు ఆగిపోయాయి. బోగీల నుంచి ఇంజిన్ విడిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

2791 నెంబర్ ధనాపూర్‌ ఎక్స్ ప్రెస్ ఈ ఉదయం సికింద్రాబాద్ నుంచి ధనాపూర్‌కు రైలు బయల్దేరింది. అయితే, జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ రైల్వే గేటు దాటాక ఇంజిన్ నుంచి బోగీ విడిపోయింది. దాంతో, బోగీలు లేకుండానే 250 మీటర్లు ఇంజిన్ వెళ్లిపోయింది. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మళ్లీ బోగీలను లింక్ చేసి తిరిగి పంపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story