Nizamabad: రన్నింగ్ ట్రైన్‌ నుంచి కిందపడ్డ వ్యక్తిని కాపాడిన 108 సిబ్బంది

*రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి వెళ్తుండగా ప్రమాదం *రన్నింగ్ ట్రైన్‌ను కిందపడ్డ వ్యక్తిని కాపాడిన 108 సిబ్బంది

Shilpa
Updated on: 9 Oct 2021 12:45 PM IST
Train Accident at Biknur Nizamabad District
X

కామారెడ్డి జిల్లాలో తప్పిన రైలు ప్రమాదం (ఫైల్ ఫోటో)

Kamareddy: రన్నింగ్ ట్రైన్‌ నుంచి కింద పడిపోయిన ఓ వ్యక్తిని 108 సిబ్బంది రక్షించారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని కిలో మీటర్ దూరం వరకు స్ట్రేచర్‌పై మోసుకెళ్లారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం యానాం పల్లికి చెందిన మోహన్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి వెళ్తుండగా బిక్నూర్ శివారులో అకస్మాత్తుగా రైలు నుంచి పడిపోయాడు.

ఇతర ప్రయాణికులు 108కు సమాచారం అందించారు. ఘటనా స్థలం వరకు అంబులెన్స్ వెళ్లే దారి లేకపోవడంతో నడుచుకుంటూ వెళ్లిన సిబ్బంది మోహన్‌ని కాపాడారు. కాలు విరిగి రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రుడిని స్ట్రేచర్‌పై తీసుకువచ్చారు. ప్రస్తుతం బాధితుడు కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Shilpa

Shilpa

Next Story