Mokila: చెట్టును ఢీకొన్న స్పోర్ట్స్ కారు.. నలుగురు విద్యార్థులు మృతి

Mokila: రంగారెడ్డి జిల్లా మోకిలాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడలో వేగంగా వస్తున్న స్పోర్ట్స్‌ కారు చెట్టును ఢీ కొట్టింది.

Arun Chilukuri
Published on: 8 Jan 2026 11:29 AM IST
Mokila: చెట్టును ఢీకొన్న స్పోర్ట్స్ కారు.. నలుగురు విద్యార్థులు మృతి
X

Mokila: చెట్టును ఢీకొన్న స్పోర్ట్స్ కారు.. నలుగురు విద్యార్థులు మృతి

Mokila: రంగారెడ్డి జిల్లా మోకిలాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడలో వేగంగా వస్తున్న స్పోర్ట్స్‌ కారు చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరొక యువతికి గాయాలయ్యాయి. గాయపడిన యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతులు సూర్యతేజ, సుమిత్, శ్రీ నిఖిల్, రోహిత్ ICFAI విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా మోకిలా నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story