Khammam: ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

Khammam: ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
x

Khammam: ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

Highlights

Khammam: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సత్తుపల్లి మండలం కిష్టారంలో అతివేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

Khammam: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సత్తుపల్లి మండలం కిష్టారంలో అతివేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్నవారిలోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతుల్లో 9ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. చండ్రుగొండ నుంచి సత్తుపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది. అయితే.. డివైడర్‌ స్టార్టింగ్‌ పాయింట్‌ దగ్గర ఎలాంటి సూచిక లేకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories