Kamareddy: బాతులు తాగేందుకు ఏర్పాటు చేసిన... నీటి తొట్టిలో పడి బాలుడి మృతి

Kamareddy: కామారెడ్డి రాజీవ్‌ నగర్‌ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. బాతులు నీళ్లు తాగేందుకు ఏర్పాటు చేసిన నీటి తొట్టెలో పడి బాలుడు చనిపోయాడు.

Arun Chilukuri
Published on: 6 Jan 2026 12:23 PM IST
Kamareddy: బాతులు తాగేందుకు ఏర్పాటు చేసిన... నీటి తొట్టిలో పడి బాలుడి మృతి
X

Kamareddy: బాతులు తాగేందుకు ఏర్పాటు చేసిన... నీటి తొట్టిలో పడి బాలుడి మృతి

Kamareddy: కామారెడ్డి రాజీవ్‌ నగర్‌ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. బాతులు నీళ్లు తాగేందుకు ఏర్పాటు చేసిన నీటి తొట్టెలో పడి బాలుడు చనిపోయాడు. బుద్ద భాస్కర్ తన కుటుంబంతో కలిసి ఓ ఫామ్‌ హౌజ్‌ వద్ద కాపాలా కూలీగా పనులు చేసుకుంటున్నారు. అక్కడ బాతులు నీళ్లు తాగేందుకు ఏర్పాటు చేసిన చిన్న తొట్టి ఉంది. వారి కుమారుడు రన్విత్ కుమార్‌ బాతుల వెనుక వెళ్లి ప్రమాదవశాత్తు తొట్టిలో పడిపోయాడు. తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా బాలుడు చనిపోయినట్లు తెలిపారు. బాలుడి మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story