బాలిక మిస్సింగ్ విషాదాంతం.. చెరువులో మృతదేహం లభ్యం

* స్కూల్‌ సిబ్బంది, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ.. దమ్మాయిగూడ చౌరస్తాలో తల్లిదండ్రుల బైఠాయింపు

R Tripura Malini
Published on: 16 Dec 2022 11:39 AM IST
Tragedy Of Missing Girl Body Found In Pond
X

బాలిక మిస్సింగ్ విషాదాంతం.. చెరువులో మృతదేహం లభ్యం 

Hyderabad: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో బాలిక మిస్సింగ్ విషాదంగా మారింది. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది. 4వ తరగతి చదువుతున్న బాలిక నిన్న ఉదయం స్కూల్‌కి వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. 24 గంటలు గడిచినా బాలిక ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంతో గాలింపు చేపట్టారు. ఇవాళ ఉదయం దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది.

ఆడుతూ, పాడుతూ ఇంట్లో తిరిగే తమ చిన్నారి ఇక లేదు అని తెలిసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. నిన్న అదృశ్యమైన తమ పాప ఎక్కడో ఒకచోట ఉంటుంది ఆలస్యంగానైనా ఇంటికి తిరిగొస్తుందని ఎదురుచూశారు. అల్లారుమద్దుగా పెంచుకున్న తమ పాప ఇక తిరిగిరాదాని తెలిసి కన్నీరుమున్నీరవుతున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story