సంగారెడ్డి జిల్లాలో విషాదం
* రెండు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు మృతి * ఇంట్లోని సంపులో శవమై కనిపించిన హర్ష * బాలుడి మృతితో కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
reprasentation image
రెండ్రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలుడు సంపులో శవమై తేలిన ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. బిహార్‌కు చెందిన శంభు తన కుటుంబంతో కలిసి గత కొంతకాలంగా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో నివాసముంటున్నాడు. తన కుమారుడు హర్షకుమార్ ఇంటి ముందు ఆడుకుంటూ సడన్‌గా అదృశ్యమయ్యాడు. రెండ్రోజుల తర్వాత అదే ఇంట్లో ఉన్న సంపు నుంచి దుర్వాసన రావడంతో గమనించిన కుటుంబసభ్యులకు హర్ష శవమై కనిపించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




