Kamareddy: రోడ్డు ప్రమాదం.. పదో తరగతి విద్యార్థి మృతి

Kamareddy: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం సావర్గావ్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 10 Dec 2025 12:31 PM IST
Kamareddy: రోడ్డు ప్రమాదం.. పదో తరగతి విద్యార్థి మృతి
X

Kamareddy: రోడ్డు ప్రమాదం.. పదో తరగతి విద్యార్థి మృతి

Kamareddy: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం సావర్గావ్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఉదయం పాఠశాలకు వెళ్తున్న ఆటో డ్రైవర్ అజాగ్రత్తతో బోల్తా పండింది. ఈ ప్రమాదంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి ప్రణవ్ అక్కడిక్కడే మృతి చెందగా.. 14 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సావర్గావ్ నుంచి ఖండే బల్లూరు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story