హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో బాలుడి అదృశ్యం విషాదాంతం

Hyderabad: బండ్లగూడ చెరువులో మూడేళ్ల బాలుడి మృతదేహం లభ్యం

Jyothi
Published on: 21 Sept 2022 11:24 AM IST
Tragedy In Hyderabad LB Nagar
X

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో బాలుడి అదృశ్యం విషాదాంతం

Hyderabad: హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో మూడేళ్ల బాలుడి అదృశ్యం విషాదాంతమైంది. ఆడుకుంటూ ఇంట్లో నుంచి వెళ్లిన బాలుడు.. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కలంతా వెతికారు. ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో బాలుడి మృతదేహాన్ని పక్కనే ఉన్న ఓ చెరువులో గుర్తించారు. ఒక్కగానొక్క కొడుకు విగతజీవిగా పడి ఉండడాన్ని చూసిన ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story