Students Suicide at Bachupalli: బాచుపల్లి పీఎస్ పరిధిలో ఇద్దరు ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్య

Students Suicide at Bachupalli: హైదరాబాద్ సిటీ పరిధిలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు ఇంటర్ విద్యార్ధులు వేర్వేరుగా ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Arun Chilukuri
Published on: 2 Dec 2025 2:37 PM IST
Students Suicide at Bachupalli: బాచుపల్లి పీఎస్ పరిధిలో ఇద్దరు ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్య
X

Students Suicide at Bachupalli: బాచుపల్లి పీఎస్ పరిధిలో ఇద్దరు ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్య

Students Suicide at Bachupalli: హైదరాబాద్ సిటీ పరిధిలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు ఇంటర్ విద్యార్ధులు వేర్వేరుగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు మంజునాథ్, వర్షితగా గుర్తింపు. మంజునాథ్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. వర్షిత హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది.

మంజునాథ్ ప్రగతి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండీయర్ చదువుతున్నాడు. వర్షిత శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ పస్టీయర్ చదువుతుంది. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కు చెందిన వర్షిత హస్టల్ లో ఉంటుంది. విద్యార్ధులు ఇద్దరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story