Hyderabad: కుటుంబంలో చిచ్చుపెట్టిన జ్యోతిషం.. వివాహిత ఆత్మహత్య

Tragedy in Alwal Indira Nagar of Medchal District
x

Hyderabad: కుటుంబంలో చిచ్చుపెట్టిన జ్యోతిషం.. వివాహిత ఆత్మహత్య

Highlights

Hyderabad: జోతిష్యంపై నమ్మకంతో భార్యాభర్తలు విడిపోతామని అనుమానంతో.. ఆత్మహత్య చేసుకుందంటున్న భర్త రామకృష్ణ

Hyderabad: మేడ్చల్‌ జిల్లా అల్వాల్ ఇందిరానగర్‌లో విషాదం చోటు చేసుకుంది. భర్త విధులకు, బాలుడు అంగన్వాడీకి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అంగన్వాడీ కేంద్రం నుండి వచ్చిన బాలుడు తల్లి... ఫ్యానుకు వెలాడటం చూసి.. కిందిపోర్షన్‌లో ఉండే వ్యక్తికి సమాచారం ఇచ్చాడు. దీంతో వారు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వివాహిత మృతి చెందింది. జోతిష్యంపై నమ్మకంతో భార్యాభర్తలు విడిపోతామని భావించి భార్య ఆత్మహత్య చేసుకుందని భర్త రామకృష్ణ చెబుతున్నాడు. అయితే భర్త రాముపై మృతురాలి తల్లిదండ్రులు దాడి చేశారు. అదనపు కట్నం కోసం వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories