Hyderabad: రంజాన్ పండుగ.. రేపు న‌గ‌రంలో ట్రాఫిక్‌ ఆంక్షలు..

Traffic Restrictions Issued For Eid Ul Fitr Prayers In Hyderabad
x

Hyderabad: రంజాన్ పండుగ.. రేపు న‌గ‌రంలో ట్రాఫిక్‌ ఆంక్షలు..

Highlights

Hyderabad: ఉదయం 8 నుంచి 11.30 వరకూ ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad: రేపు రంజాన్ పండుగ సంద‌ర్బంగా హైదరాబాద్ లో ట్రాఫిక్‌ ఆంక్షలు పెట్టారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకూ మీరాలం ట్యాంక్‌ ఈద్గా, హాకీ గ్రౌండ్‌, మాసాబ్‌ ట్యాంక్‌ పరిసరాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆ సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు. మీరాలం ఈద్గా ప్రార్థనలకు వచ్చే వారి వాహనాలను పురానా పూల్‌, కామాటిపుర, కిషన్‌ బాగ్‌, బహదూర్‌ పురా ఎక్స్‌ రోడ్స్‌ నుంచి అనుమతినిచ్చారు. ఈ సమయంలో సాధారణ వాహనదారులకు బహదూర్‌ పురా ఎక్స్‌ రోడ్స్‌ నుంచి ఈద్గా వైపు అనుమతి లేదని తెలిపారు.ఈ వాహనాలను బహదూర్‌ పురా క్రాస్‌ రోడ్డు దగ్గర కిషన్‌ బాగ్‌, కామాటి పుర వైపు మళ్లిస్తున్నట్టు తెలిపారు. ఇక్కడికి వచ్చే వాహనాలు జూ పార్క, మసీద్‌ అల్హా ఓ అక్బర్‌కు ఎదురుగా ఉన్న బహిరంగ స్థలంలో పార్కింగ్‌ చేయాలని తెలిపారు. శివరాంపల్లి, దానమ్మ హాట్స్‌ నుంచి ఈద్గా వైపు వచ్చే వాహనాలను దానమ్మ హాట్స్‌ చౌరస్తా నుంచి అనుమతిస్తున్నట్టు తెలిపారు.

ఈ సమయంలో సాధారణ వాహనదారులకు ఈద్గా వైపు అనుమతి ఉండదన్నారు. ఈ వాహనాలను దానమ్మ ఎక్స్‌ రోడ్స్‌ నుంచి శాస్త్రీ పురం, ఎన్‌ఎస్‌ కుంట వైపు మళ్లిస్తున్నారు.ఈ వాహనాలకు మోడ్రన్‌ సామిల్‌ పార్కింగ్‌ పక్కన, ఇద్గా మైదాన్‌కు ఎదురుగా మెయిన్‌ రోడ్డుపై, మీరాలం ఫిల్టర్‌ బెడ్‌, మీరాలం ఫిల్టర్‌ బెడ్‌కు పక్కన ఉన్న ఖాళీ స్థలం, దానికి ఎదురుగా ఉన్న సుఫీ కార్స్‌, యాదవ్‌ పార్కింగ్‌ కార్లు వద్ద పార్కింగ్‌ కాలాపత్తార్‌ వైపు నుంచి ఈద్గాకు వెళ్లే వాహనాలు.. కాలాపత్తార్‌ లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి వెళ్లాలన్నారు. సాధారణ వాహనాలు పీఎస్‌ వద్ద నుంచి మోచీ కాలనీ, బహదూర్‌ పురా, శంషీర్‌ గంజ్‌, ఎన్‌కే కుంట వైపు వెళ్లాలన్నారు. వాహనాలను బయ్యా పార్కింగ్‌, ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ పంపు వద్ద పార్కింగ్‌ చేయాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories