త్వరలో వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పనున్న ట్రాఫిక్ పోలీసులు.. వెహికిల్ ని బట్టి ఫైన్...

Traffic Police Good News to Motorists | Hyderabad New Traffic Rules | Live News
x

త్వరలో వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పనున్న ట్రాఫిక్ పోలీసులు.. వెహికిల్ ని బట్టి ఫైన్...

Highlights

Traffic Police Fines: హైదరాబాద్ లో ఓవర్ స్పీడ్ పై లిమిట్ ని పెంచే అవకాశం...

Traffic Police Fines: హైదరాబాద్ లో బండి బయటకి తీయాలంటే నగరవాసులు భయపడుతున్నారు.. ఏదో ఒక ట్రాఫిక్ వయలేషన్ కింద ఫొటో కొట్టి ఫైన్ వేస్తున్నారు. హెల్మెట్, పిలియన్ రైడర్ హెల్మెట్, సైడ్ మిర్రర్ వయలేషన్స్ కి చలాన్స్ తక్కువ ఉన్నా... ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ కి మాత్రం వెయ్యి రూపాయలు చెల్లించుకోవాల్సిందే.. అయితే ఇప్పటికే పెండింగ్ చలాన్స్ కి భారీగా డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు త్వరలో వాహనదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు..

సిటీలో వాహనం నడపాలంటే అన్నీ రూల్స్ పాటించాల్సిందే.. ట్రాఫిక్ రూల్స్ వయలేట్ చేస్తే.. రోడ్డుపై కెమెరా పట్టుకున్న ట్రాఫిక్ పోలీసో.. జంక్షన్స్ దగ్గర ఉన్న సీసీ కెమెరాల ద్వారానో.. ఫొటో కొట్టి చలాన్ వేస్తున్నారు.. డ్రైవర్ కు హెల్మెట్ లేకపోయినా.. పిలియన్ రైడర్ కి హెల్మెట్ లేకపోయినా 235 రూపాయల ఫైన్ వేస్తున్నారు... ఇక సైడ్ మిర్రర్ లేకపోతే 135 రూపాయల జరిమానా చెల్లించాలి. ఇంతవరకు బాగానే ఉన్నా రాంగ్ రూట్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్, ట్రిఫుల్ రైడింగ్ కి వెయ్యి 35 రూపాయల చలాన్ వేస్తున్నారు.. దీంతో ఒక్క వయలేషన్ జరిగినా వాహనదారుల జేబు ఖాళీ అవుతోంది..

ట్రాఫిక్ చలాన్స్ ఎక్కువ మొత్తంలో ఉంటే పే చేయడానికి వాహనదారులు వెనకాడుతున్నారని.. వెహికిల్ ని బట్టి ఫైన్ వేయడానికి ప్లాన్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.. రాంగ్ రూట్ డ్రైవ్ కి బైక్ అయినా.. కార్ అయినా.. లారీ అయినా అన్నింటికి ఒకేలా వెయ్యి 35 రూపాయల చలాన్ ఉంది. అయితే అలా కాకుండా వెహికిల్ ని బట్టి చలాన్ ని వేయాలనుకుంటున్నారు ట్రాఫిక్ పోలీసులు.. రాంగ్ రూట్ లో వెళ్లే బైక్ కి 235 రూపాయలు.. రాంగ్ రూట్ కార్ కి 535 రూపాయలు.. రాంగ్ రూట్ హెవీ వెహికిల్స్ కి వెయ్యి 35 రూపాయలు అమలు చేయనున్నారు..

సిటీలో ఓవర్ స్పీడ్ పై కూడా లిమిట్ ని పెంచడానికి ప్లాన్ చేస్తున్నారు. అమల్లో ఉన్న స్పీడ్ లిమిట్ కి 10శాతం ఫీజబిలిటీ ఇవ్వనున్నారు.. స్పీడ్ లిమిట్ 60 ఉంటే.. 66 స్పీడ్ దాటితేనే ఓవర్ స్పీడ్ చలాన్ వేయనున్నారు. అయితే సిటీలో కామన్ స్పీడ్ లిమిట్ పెట్టడంపై అధ్యయనం చేస్తున్నారు. దీనికోసం ఇతర మెట్రో సిటీస్ ని విజిట్ చేయనున్నారు ట్రాఫిక్ పోలీసులు.ట్రాఫిక్ వయలేషన్స్ చార్జెస్ ని తగ్గించాలనుకుంటున్న ట్రాఫిక్ పోలీసుల ఉద్దేశ్యం కేవలం వాహనదారులపై భారం మోపకుండా ఉండడానికే తప్ప.. ఎలాగూ తక్కువ ఫైన్ ఉందని నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తే ప్రమాదంలో పడడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు ట్రాఫిక్ పోలీసులు...

Show Full Article
Print Article
Next Story
More Stories