Hyderabad: పరీక్షకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌

Traffic Inspector helped Inter Student in Hyderabad
x

Hyderabad: పరీక్షకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌

Highlights

Hyderabad: రోడ్డు ప్రమాదంలో గాయాలైన విద్యార్థినికి చికిత్స చేయించిన ఇన్స్‌పెక్టర్

Hyderabad: ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాసేందుకు వస్తుండగా... రోడ్డు ప్రమాదం జరిగి ఓ విద్యార్థినికి గాయాలు కాగా అక్కడే ఉన్న మహంకాళి ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ ఆమెను ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించి విధి నిర్వహణలో మానవత్వం చాటుకున్నారు.. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాసేందుకు ఓ విద్యార్థిని తన తండ్రితోపాటు ద్విచక్ర వాహనంపై పరీక్ష కేంద్రానికి వెళ్తుండగా సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని తపస్య కళాశాల వద్ద అదుపుతప్పి కింద పడిపోయారు.

దీంతో ఆ విద్యార్థిని తలకు గాయాలయ్యాయి. అక్కడే విధులు నిర్వహిస్తోన్న మహంకాళి ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ ఉపాశంకర్ గమనించి... వెంటనే తన వాహనంలో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. పరీక్షా కేంద్రంలో ప్రిన్సిపాల్ అనుమతి తీసుకుని ఆమెను ప్రాథమిక చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం సమయానికి తిరిగి పరీక్ష కేంద్రంలో వదిలిపెట్టగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories