Karimnagar: సంజయ్ విడుదల నేపథ్యంలో కరీంనగర్‌లో ట్రాఫిక్ మళ్లింపు

Bandi Sanjay: బండి సంజయ్‌ విడుదల నేపథ్యంలో భారీ బందోబస్తు

Dhatripriya
Published on: 7 April 2023 9:09 AM IST
Traffic Diversion In Karimnagar
X

Karimnagar: సంజయ్ విడుదల నేపథ్యంలో కరీంనగర్‌లో ట్రాఫిక్ మళ్లింపు

Karimnagar: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు అయ్యింది. దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, కేసు విచారణకు సహకరించాలని షరతులు విధించారు. దీంతో బండి సంజయ్ ఇవాళ కరీంనగర్‌ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. టెన్త్ హిందీ ప్రశ్న పత్రం లీకేజీ కేసులో సంజయ్‌ను ఏ1 నిందితుడిగా నమోదు చేయడం, కోర్టు 14 రోజుల రిమాండ్‌కు ఆదేశించింది. దీనిపై సంజయ్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేస్తే.. పోలీసులు కస్టడీ పిటిషన్‌ దాఖలు చేశారు. వీటిపై కోర్టులో వాదనలు జరిగాయి.

ఇక బండి సంజయ్ విడుదల నేపథ్యంలో కరీంనగర్ జైలు దగ్గర 144 సెక్షన్ విధించారు. జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు పరిసరాల్లో ఎవరు గుమికూడవద్దని సూచనలు చేశారు. ర్యాలీలు, అనుమతులు, సమావేశాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

Dhatripriya

Dhatripriya

Next Story