మంత్రి కేటీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ.. మీకు చేత కాకనా.. లేక అందులో..

Revanth Reddy: మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

Arun Chilukuri
Published on: 7 Feb 2022 3:50 PM IST
TPCC Revanth Reddy Writes Open Letter to Minister KTR
X

మంత్రి కేటీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ.. మీకు చేత కాకనా.. లేక అందులో..

Revanth Reddy: మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని లేఖలో ఆయన డిమాండ్ చేశారు. అక్రమ కట్టడాలకు సంబంధించి ఆధారాలను లేఖలో జత చేసిన రేవంత్‌.. ప్రభుత్వ భూములు, చెరువులు కజ్బా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ నేతల అక్రమాలను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. చేత కాకనా.. లేక అందులో వాటాలు ఉన్నాయా అని నిలదీశారు. మున్సిపల్ మంత్రిగా స్పందించి అక్రమ నిర్మాణాలను కూల్చివేయించాలని లేకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని లేఖలో హెచ్చరించారు రేవంత్‌రెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story