Revanth Reddy: జయశంకర్ పేరు కాలగర్భంలో కలపాలని సీఎం చూస్తున్నారు..

Revanth Reddy: టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ కోసం పరితపించిన ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేట అన్యాయానికి, దోపిడికి...

Arun Chilukuri
Published on: 21 May 2022 5:53 PM IST
TPCC Revanth Reddy Rachabanda at Akkampeta
X

Revanth Reddy: జయశంకర్ పేరు కాలగర్భంలో కలపాలని సీఎం చూస్తున్నారు..

Revanth Reddy: టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ కోసం పరితపించిన ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేట అన్యాయానికి, దోపిడికి గురవుతుందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జయశంకర్ స్ఫూర్తితో అక్కంపేటలో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లయినా అక్కంపేట గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.

జయశంకర్ పేరు కాలగర్భంలో కలుపాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీని అక్కంపేటకు తీసుకు వస్తామని చెప్పారు. అక్కంపేట గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని వరంగల్ రైతు డిక్లరేషన్ అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story