Revanth Reddy: నేను చంద్రబాబు మనిషిని అయితే... సీఎం కేసీఆర్ చంద్రబాబు చెప్రాసీ

Revanth Reddy: టీఆర్ఎస్ నేతలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Arun Chilukuri
Published on: 9 July 2021 7:45 PM IST
TPCC President Revanth Reddy Slams KCR and KTR
X

Revanth Reddy: నేను చంద్రబాబు మనిషిని అయితే... సీఎం కేసీఆర్ చంద్రబాబు చెప్రాసీ

Revanth Reddy: టీఆర్ఎస్ నేతలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ నక్క.. పులి తోలు కప్పుకున్నట్టు వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ బతుకే తెలుగు దేశం పార్టీ అని అన్నారు. కేసీఆర్‌తో సహా ఆయన మంత్రివర్గంలో ఉన్న 11 మంది టీడీపీ వాళ్లేనని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందెవరని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కాళ్లు మొక్కితే కేసీఆర్‌కు టికెట్ దక్కిందన్నారు. తెలుగుదేశం పార్టీతో లింక్ లేని టీఆర్ఎస్ నాయకుల పేరు చెప్పాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. హరీష్‌ రావుకు రాజకీయ భిక్షపెట్టింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. సిరిసిల్లలో కేటీఆర్‌కు రాజకీయ భిక్షపెట్టింది టీడీపీ అని గుర్తు చేశారు. తాను చంద్రబాబు మనిషిని అయితే.. సీఎం కేసీఆర్ చంద్రబాబు చెప్రాసీ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story