TPCC : ఇవాళ రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తొలి సమావేశం

గాంధీభవన్‌లో జరగనున్న సమావేశం భేటీలో పాల్గొననున్న ఇన్‌చార్జి మాణిక్కం ఠాకూర్‌ నిరుద్యోగంపై పార్టీ తరఫున కార్యక్రమం..

Sandeep Reddy
Published on: 8 July 2021 11:14 AM IST
TPCC President Revanth Reddy First Meeting in Gandhi Bhavan Today
X

రేవంత్‌రెడ్డి 

TPCC: రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని టీపీసీసీ తొలి సమావేశం ఇవాళ జరగనుంది. గాంధీభవన్‌లో జరగనున్న ఈ సమావేశంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ కూడా పాల్గొననున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన సమస్య అయిన నిరుద్యోగంపై పార్టీ తరఫున కార్యక్రమం నిర్వహించే విషయంపై చర్చించే అవకాశం ఉంది. అయితే దీనిపై కార్యక్రమం చేపట్టాలా, పాదయాత్ర చేపట్టాలా అన్నదానిపైనా చర్చించనున్నట్లు చెబుతున్నారు. తొలుత ఉదయం టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, కమిటీ చైర్మన్లతో సమావేశమవుతారు. అనంతరం డీసీసీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story